గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » తమన్నా నవ్వూ.. రంగూ సమస్తం అద్భుతం... నోటి దులానందంలో సినీ పెద్దలు (Tollywood Senior Actors | Tamannah | Sneha | Anr | Chiranjeevi, Allu Aravind)
WD
సినిమా రంగంలో కొడుకుల్ని వారసులుగా ప్రకటించినట్లు కూతుళ్ళను ప్రకటించరు. అదలా ఉంచితే.. తమ వారసుడి పక్కన నటించే హీరోయిన్లపై కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయంలో సీనియర్‌ నటుడు అక్కినేని సంగతి తెలిసిందే. చార్మితోనూ, మరో కుర్ర హీరోయిన్‌ కనబడితే గంతులేయాలనిపిస్తుంది అంటుంటారు పబ్లిక్‌ ఫంక్షన్లలో. ఆమధ్య రచ్చ ఆడియోలోనూ చిరంజీవిది కూడా ఇదే తంతు...

మిల్కీ బ్యూటీ తమన్నాను చూసి తన పక్కన నటించాలనుందని అనేశారు. అలాంటిదే అల్లు అరవింద్‌ కూడా అన్నారు. ఈయనకు సినిమారంగంలో వ్యాపారం మెళకువలు బాగా తెలుసు. అందుకే టాప్‌ 5 నిర్మాతల్లో ఇతనూ ఒకరుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి.. రామ్‌ నటించిన 'ఎందుకంటే ప్రేమంట' ఫంక్షన్‌లో తమన్నాను చూసి టెంప్ట్ అయ్యారు. తెలుగులో నాకిష్టమైన హీరోయిన్‌ తమన్నా. ఆమె నవ్వు, రంగూ సమస్తం ఒక అద్భుతం. నేను ఆమె ఫ్యాన్‌ని అంటూ పళ్లికిలించారు.

గతంలో కూడా స్నేహ గురించి కాస్త అటుఇటుగా ఇలాగే మాట్లాడారు. నేను ఓ ఇరవై సంవత్సరాలు వెనుక పుట్టి వుంటే స్నేహను పెండ్లి చేసుకునేవాడినని పబ్లిక్‌ ఫంక్షన్‌లో చెప్పి అక్కడే ఉన్న గులాబి కూడా ఇచ్చారు. ఇదేదో ఫ్యాన్స్‌ను ఉత్సాహపర్చడానికి అనుకుంటే పొరపాటే. తమ మనసులోని మాటను బాహాటంగా ఇలా చెప్పి నోటి దులానందాన్ని ఇలా తీర్చుకుంటున్నారని ఇండస్ట్రీలోని జనం అనుకుంటున్నారు. తెరముందు ఇలా వ్యాఖ్యానిస్తే తెర వెనుక ఎలా ఉంటారో వేరే చెప్పాలా అంటున్నారు వారు.
సంబంధిత సమాచారం
Feedback Print