ప్రధాన పేజివినోదం » వెండితెర » గుసగుసలు » ప్రేక్షకులు కోరుకుంటే తప్పు లేదంటున్న మోనాల్ (Monal Gajjar Hot | Sudigadu Cinema | Exposing)
ప్రేక్షకులు కోరుకుంటే తప్పు లేదంటున్న మోనాల్
గురువారం, 2 ఆగస్టు 2012( 21:33 IST )
WD
ఆమె చేసింది రెండే చిత్రాలు. ఒకటి కాలేజీ స్టోరీ వెన్నెల వన్ అండ్ హాఫ్. రెండోది ఇప్పుడు అల్లరి నరేష్‌తో సుడిగాడు. ఆమే మోనాల్ గజ్జర్. తెలుగులో అవకాశాలు రావడం చాలా థ్రిల్‌గా వచ్చిందని చెప్పింది. మొదట పూరీ జగన్నాథ్ నన్ను పిలిచారు. కానీ కథ ఇంకా సమయం పట్టడంతో ఆయనే ప్రభాకర్ అనే డైరెక్టర్‌కు పరిచయం చేశారు. అదే ఒక కాలేజీ స్టోరీ అని చెప్పింది.
ప్రస్తుతం రామ్‌తో కూడా నటిస్తున్నానని తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని అంది. యువతరాన్ని ఆకట్టుకోవడంలో అందాలు ఆరబోయాల్సిందేనా అనే ప్రశ్నకు.. ప్రేక్షకులు కోరుకున్నట్లు నటించడంలో తప్పులేదు. అయితే కేవలం అందాన్ని చూడటానికి వారు రారు. కథను కూడా చూస్తారు. నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను.
నలుగురు గుర్తించుకునే పాత్ర చేస్తాను. పాత్ర డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తానని గ్రీన్ స్నిగల్ ఇచ్చింది... ఇంకేం.. తెలుగులో మోనాల్ హాట్ గురూ.. అంటుందేమో చూడాలి.