గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » కాజల్ కోసం ఎగబడుతున్న బాలీవుడ్‌ వృద్ధ హీరోలు (Kajal Agarwal | Call Sheets | Actors)
WD
ఒక్కోసారి అవకాశాల కోసం వెంపర్లాడే భామలు.. ఆ తర్వాత టైం బాగుండి అదేపనిగా సినిమాలు వస్తే ఏంచేస్తారు? ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ కాజల్‌ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉందట. అవకాశాలు వస్తున్నాయి. కానీ తనకంటే ఎక్కువ వయస్సు వారితో హీరోయిన్‌గా చేయాల్సి రావడంతో మింగలేక కక్కలేక పోతుందట.

అక్షయ్‌కుమార్‌, గోవింద, అజయ్‌దేవగన్‌లు ఆమెకోసం అర్రులు చాస్తున్నారట. ఇటీవలే అక్షయ్‌ కుమార్‌తో ఓ చిత్రంలో నటిస్తే అది హిట్టయి కూర్చుంది. దీంతో సెంటిమెంట్‌తో రెండవ సినిమా 'స్పెషల్‌ చబ్బీస్‌'లో కూడా నటిస్తోంది. అయితే ఈమె గోల్డెన్‌ లెగ్‌ గురించి తెలిసిన సీనియర్ హీరోలు నిర్మాతల్ని పురమాయిస్తున్నారు. దీంతో ఆమె చేయనని చెప్పేస్తున్నట్లు భోగట్టా.

తెలుగు తమిళ చిత్రాలతో యమ బిజీగా ఉన్నానని అంటోందట. యూత్‌ హీరోలైనా షాహిద్‌ కపూర్‌ లాంటివారితో అయితే డేట్స్‌ ఎడ్జస్ట్‌ చేస్తానని కూడా అందిట. తెలుగులో మహేష్‌, రామ్‌ చరణ్‌, ఎన్‌టిఆర్‌ చిత్రాల్లో నటిస్తోంది.
సంబంధిత సమాచారం
Feedback Print