ప్రధాన పేజివినోదం » వెండితెర » గుసగుసలు » నాగార్జున దారిలో రజినీకాంత్... కృష్ణుని వేషం వేసేందుకు రెడీ...!! (Nagarjuna | Shirdi Sai | Rajinikanth | Lord Krishna)
నాగార్జున దారిలో రజినీకాంత్... కృష్ణుని వేషం వేసేందుకు రెడీ...!!
మంగళవారం, 18 సెప్టెంబర్ 2012( 13:06 IST )
WD
రజినీకాంత్ కూడా యువసామ్రాట్ నాగార్జున దారిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ ఫిలిమ్ వర్గాలు. కాకపోతే ఇది ఫుల్ టైమ్ కాదు.. పార్ట్ టైమ్‌గానే. ఏంటీ కృష్ణుడు వ్యవహారం అనుకుంటున్నారా...?
అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్‌లో ఓ మైగాడ్ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కొద్దిసేపు కృష్ణుడుగా నటిస్తాడట. కథాపరంగా కృష్ణుడు గెటప్పులో అక్షయ్ నటిస్తాడు. ఈ కథ రజినీకాంత్‌కు ఎంతగానో నచ్చిందట.
దీంతో ఈ చిత్రాన్ని తమిళంలో చేయాలని ఆయన ఉత్సాహం చూపించినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ ఎలా కృష్ణునిగా నటించాడో.. అలాగే రజినీకాంత్ కూడా కృష్ణుని పాత్రలో కనువిందు చేయాలని భావిస్తున్నారట. మొత్తమ్మీద ఆధునిక కాలంలో దేవుళ్ల పాత్రలపై నటులకు ధ్యాస మళ్లడం శుభ పరిణామమే.