గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » 'ద డర్టీ పిక్చర్‌'తో బాలీవుడ్‌లో హీరోయిన్ హవా నడుస్తోందా? (The Dirty Picutre | Bollywood | Silk Smita | Madhu Bandarkar)
File
FILE
బాలీవుడ్‌లో 'ద డర్టీ పిక్చర్' కొత్తదనానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. తెలుగు సెక్సీ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా నిర్మతమైన ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల భామ విద్యా బాలన్ నటించారు. ఈ చిత్రంలో నటించేందుకు ఆమె పెద్ద సాహసమే చేశారని చెప్పొచ్చు. ఫలితంగా ఆమె ఈ చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను ఏకంగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల కంటే.. విద్యా బాలన్‌ ప్రదర్శించిన హావభావాలకే మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా.. ఈ చిత్రాన్ని నిర్మించే సమయంలో ప్రతి ఒక్కరూ పెదవి విరిచిన వారే. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆ చిత్రం సాధించిన వసూళ్లు.. సాధించిన విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ దిమ్మదిరిగి పోయారు. దీంతో హీరోయిన్ల కథలకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించేందుకు బాలీవుడ్ భామలు పోటీ పడుతున్నారు.

ఇందులోభాగంగా మధు బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్' అనే చిత్రం రూపొందగా, ఇందులో కరీనా కపూర్ నటించింది. ఈ చిత్రంలో అర్జున్ రామ్‌పాల్ హీరోగా నటించినప్పటికీ.. ఆయన ప్రస్తావన ఎక్కడా రాలేదు. మరోవైపు.. 'హీరోయిన్' చిత్రం గురించి మాట్లాడాల్సి వస్తే.. కరీనా గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది.

మరోవైపు.. రాణఇ ముఖర్జీ గెస్ట్ రోల్‌లో పూర్తి స్కిన్ షో ప్రదర్శిస్తున్న చిత్ర 'అయ్య'. ఇందులో పృథ్విరాజ్ హీరో. ఈ చిత్ర ప్రమోషన్, ప్రచారంలో మాత్రం హీరో జాడ ఎక్కడా కనిపించడం లేదు కదా రాణి ముఖర్జీ హాట్‌హాట్ ఫోటోలు కుర్రకారు గుండెలను గుచ్చుకునేలా ఉన్నాయి. మరోవైపు.. 'ఇంగ్లీష్.. వింగ్లీష్' చిత్రంలో సీనియర్ శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది. ఇందులో కూడా ఈమె బాగానే అందాలను ఆరబోసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబరులో విడుదల కానుంది. మొత్తంమీద బాలీవుడ్‌లో హీరోయిన్ల రాజ్యం సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
సంబంధిత సమాచారం
Feedback Print