బ్రహ్మి డేట్స్ ఇచ్చాడా...? ప్రిన్స్ మహేష్ వాకబు... అద్గదీ బ్రహ్మానందం అంటే...

Brahmanandam
Venkateswara Rao. I| Last Modified మంగళవారం, 22 అక్టోబరు 2013 (14:57 IST)
WD
బ్రహ్మి డేట్స్ ఇచ్చాడా...? ప్రిన్స్ మహేష్ వాకబు చేశాడట. అసలీమధ్య హీరోలంతా తమ డేట్స్‌ కంటే హీరోయిన్‌ డేట్స్‌ కంటే కమేడియన్స్‌ డేట్స్‌ చూసుకుని మరీ దర్శకుడికి డేట్స్‌ ఇస్తున్నారు. ఒకప్పుడు కమేడియన్స్‌ను ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు.. అంటూ చమత్కరించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆటకు ముఖ్యుడు కూరలో ఉప్పులా మారిపోయారు. చాలామంది హీరోలు కమేడియన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కోవలో బ్రహ్మానందం ఎప్పుడో చేరిపోయాడు.

కొన్నిసార్లు బ్రహ్మానందం కామెడీ అపహాస్యం అయినా అది దర్శకుడి లోపమే కానీ తనదేమీ కాదని కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అత్తారింటికి...లో బ్రహ్మానందం చేసిన ఎపిసోడ్‌ కాస్త ఎక్కువై విసుగుపుట్టిస్తుంది. కానీ తర్వాత చిత్రంలో మాత్రం అతను చిత్రానికి కీలకమవుతాడు. మంచు విష్ణు నటించిన 'దూసుకెళ్తా'లో సెకండాఫ్‌ మొత్తం బ్రహ్మానందం మోసేశాడు.

ఆయనతోపాటు వెన్నెల కిషోర్‌ మోసేశాడు. దాంతో సినిమాకు ఒక లుక్‌ వచ్చింది. ఇప్పుడు హీరోలంతా బ్రహ్మానందాన్ని ఒక్కసీనైనా ఉండేలా కథ రాయమని చెబుతున్నారు. తాజాగా శ్రీను వైట్ల సినిమా 'ఆగడు'లో బ్రహ్మి డేట్స్‌ ఇచ్చాడా? అని మహేష్‌ అడిగినట్లు తెలిసింది. అదీ బ్రహ్మి టాలెంట్‌.


దీనిపై మరింత చదవండి :