నటి శిల్పాకు ఊరట
హైదరాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 23 మే 2007( 21:25 IST )
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెతో ముద్దువివాదంకు సంబంధించి బహిరంగ స్థలంలో అశ్లీలంగా ప్రవర్తించినందుకు ఆమెకు వ్యతిరేకంగా కేసులు నమోదైన విషయం తెల్సిందే.
దీంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా చూడాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు రాజస్థాన్‌లోని ముండవర్ ఎస్పీ నోటీసులు జారీ చేశారు. చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, న్యాయమూర్తులు బీపీ సింగ్, జీపీ మాధుర్‌లతో కూడిన ధర్మాసనం ఆ ఎస్పీకి ఈ మేరకు శిల్పకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని నోటీసులు పంపింది.