హర్రిపోట్టర్ మానియాలో ప్రపంచం
శుక్రవారం, 13 జులై 2007( 12:09 IST )
హైదరాబాద్ ఐమాక్స్ ధియేటర్ వెండితెరపైకి దూసుకు వస్తున్న హర్రిపోట్టర్ 5, ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించనున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా దాదాపు మరో 4వేల 285 కేంద్రాలలో హర్రిపోట్టర్ ప్రత్యక్షం అయ్యాడు.
బుధవారం హాలీవుడ్‌లో విడుదలైన 'హార్రిపోట్టర్' ఒక్క రోజులో 12 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంతకుముందు 8 మిలియన్ డాలర్లను వసూలు చేసిన 'ది రిటర్న్ ఆఫ్ ది కింగ్' రికార్డును బద్దలుకొట్టింది.
గతంలో విడుదలైన హార్రిపోట్టర్ చిత్రాలలోని చాలా కీలకమైన పాత్రలు మళ్లీ దర్శనమివ్వనున్నాయి. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే హార్రిపోట్టర్ తొలిసారి ముద్దు సన్నివేశం. ఇంతకుముందు విడుదలైన చిత్రాలలో హార్రి ముద్దు సన్నివేశాలలో నటించలేదు.
కాగా హార్రిపోట్టర్ తార డానియల్ రాడ్ క్లిఫ్ మాట్లాడుతూ, తాను పోషించిన పాత్రను దర్శకులు అత్యద్భుతంగా మలిచారని తెలిపాడు. అంతేకాదు హార్రిపోట్టర్ సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆద్యంతం రసవత్తరంగా సాగిందన్నాడు. గతంలో చిత్రాలకన్నా ఎంతో భిన్నంగా చిత్రాన్ని మలిచారని తెలిపారు.
138 నిమిషాలపాటు వినోదంలో ముంచెత్తనున్న హార్రిపోట్టర్ రాకకై టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగులోనూ హార్రి తన ప్రతాపాన్ని చూపుతాడని సినీ పండితులు చెపుతున్నారు.