కనకవర్షంతో రికార్డులు తిరగరాస్తున్న హ్యారీపోట్టర్
లాస్ ఏంజిల్స్ (ఏజెన్సీ), బుధవారం, 18 జులై 2007( 08:41 IST )
ఉత్తర అమెరికా థియేటర్లలో ‘హ్యారీపోట్టర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్’ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. హ్యారీపోట్టర్ దెబ్బకు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ట్రాన్స్‌ఫార్మర్స్, భారీ అంచనాలతో రూపొందించిన ర్యాటాటోయిల్లే చిత్రాలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. వేసవి కానుకగా గత వారం ప్రజల ముందుకు వచ్చిన హ్యారీపోట్టర్ విడుదలైన తొలివారంలోనే 139.7 మిలియన్ డాలర్ల మేరకు వసూళ్లు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో 190 మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదుచేసింది. మొత్తం మీద ఈసినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 330 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, హాలీవుడ్ చిత్రరంగంలో సరికొత్త రికార్డుల నమోదు దిశగా ముందుగు సాగుతోంది. హ్యారీపోట్టర్ సిరీస్‌లో ఆఖరి, చివరిభాగం ఈనెల 21వ తేదీన విడుదల కానుండడం కూడా ఈ సినిమా ఘనవిజయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.