సమ్మె హాలీవుడ్ రచయితల సంఘం తీర్మానం
లాస్ఎంజిల్స్ (ఏజెన్సీ), శనివారం, 3 నవంబర్ 2007( 10:07 IST )
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. హాలీవుడ్ సినీ రచయితలు సమ్మె చేయాలని నిర్ణయించారు. యాజమాన్యపు హక్కులు, ఇతరత్రా సదుపాయాల కల్పనపై నెలకొన్న వివాదాలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా జరుగుతున్న అమెరికా టెలివిజన్, సినిమా రచయితల సంఘం (రైటర్స్ గిల్డ్) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు పాట్రిక్ వెర్రోన్ తెలిపారు. అయితే సమ్మె చేపట్టే తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ గిల్డ్‌లో 12,000 మంది రచయితలకు సభ్యత్వం ఉంది. 1988లో తొలిసారిగా హాలీవుడ్ రచయితలు సమ్మె చేశారు. సుమారు 20 ఏళ్ళ తర్వాత మళ్లీ సమ్మె చేయాలని రచయితలు నిర్ణయించారు.