హాలీవుడ్ దర్శకుడు స్పిల్‌బర్గ్‌కు "డీ మిల్లి అవార్డు"
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 15 నవంబర్ 2007( 17:46 IST )
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవన్ స్పిల్‌బర్గ్ ఈ ఏడాది డి మిల్లీ అవార్డును స్వంతం చేసుకున్నారు. 65వ గోల్డన్ గ్లోబస్ వార్షికోత్సవంలో ఈ అవార్డును స్టీవన్ స్పిల్‌బర్గ్‌కు హాలీవుడ్ అంతర్జాతీయ ప్రెస్ అసోసియేషన్ ప్రదానం చేయనుంది.
ఈ విషయమై బెవెర్లీ హిల్టన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ ప్రెస్ అసోసియేషన్ కార్యదర్శి జోష్ బ్రోలిన్ మాట్లాడుతూ... స్టీవన్ వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ఈ అవార్డును అందుకోనున్నారని చెప్పారు. ఈ అవార్డును స్పిల్‌బర్గ్ ఆరుసార్లు కైవసం చేసుకున్నారని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ వ్యాప్తమైన "ఈటీ: ది ఎక్స్‌ట్ర-టెరరిస్టియల్" మరియు "జాస్" చిత్రాల్ని దర్శకత్వం వహించడంతో ఈ అవార్డు ఆయన దక్కిందని ఆ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుతం స్పిల్‌బర్గ్ "ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కిల్" చిత్ర పోస్ట్ ప్రొడెక్షన్ కార్యక్రమాల్లో ఉన్నట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.