గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » బ్రిట్నీ అంటే బోర్... బోర్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Britney
FILE
బ్రిట్నీ స్పియర్స్, ఆమి విన్ హౌస్ వంటి హాట్ తారలు తమను ఆట్టే ఆకర్షించలేరని లండన్‌లోని టీనేజ్ గాళ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 11- 18 ఏళ్ల మధ్య వయస్సుగల టీనేజ్ అమ్మాయిల ప్రాధాన్యాలు, అభిప్రాయాలు... తెలుసుకునేందుకు లండన్‌లోని 'షుగర్' అన్న పేరుగల పత్రిక నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

బ్రిట్నీ వంటి తారలు తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేరని సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం టీనేజ్ గాళ్స్ స్పష్టం చేశారు. స్నేహితుల ప్రభావం తమపై ఉంటుందని 87 శాతం మంది తెలియజేయటం గమనార్హం.

తమపై తమ తల్లిదండ్రుల ముద్ర బలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది అమ్మాయిలు వ్యక్తీకరించారు. తమకంటూ ప్రత్యేక అభిప్రాయాలున్నాయనీ... తమ స్వశక్తిపై తమకు పూర్తి నమ్మకముందని దాదాపు సర్వేలో పాల్గొన్న అమ్మాయిలందరూ వ్యక్తపరిచారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే కదా...