జేమ్స్ కేమెరోన్ అవతార్ చిత్రం వాయిదా
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 13 డిసెంబర్ 2007( 18:29 IST )
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమెరోన్ నిర్మిస్తున్న అవతార్ చిత్రం విడుదల మళ్లీ వాయిదా పడింది. త్రీడీ సైన్స్ ఫిక్షన్‌లతో కలగలిపి పూర్తి యాక్షన్ చిత్రంగా తెర కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2009, డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లు ట్వెంటీయత్ సెంచెరీ ఫాక్స్ సంస్థ ప్రకటించింది.
అంతకుముందు 2009, మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన ఆ సంస్థ అనివార్య కారణాలతో తిరిగి అవతార్ చిత్రాన్ని 2009, డిసెంబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ చిత్ర నిర్మాణం ఆలస్యమవుతున్న కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అలాగే ఈ చిత్రానికి సంబంధించిన త్రీడీ ఎఫెక్ట్స్‌ను సమకూర్చడంలో కాస్త ఆలస్యమవుతోందని ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ వైస్ ఛైర్మన్, హచ్ పార్కర్ ఈ మేరకు విషయాన్ని వెల్లడించారు. అయితే 2009 ఏడాదిలో డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని క్రిస్‌మస్ పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.