నూతన సంవత్సరం వస్తుందంటే దేశాధినేతల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఎలా ఉంటుందన్నదానిపై దృష్టి సారిస్తారు. అంతేకాదు, తమ జాతకం ఎలా ఉందన్న విషయాన్ని జ్యోతిష్కులను అడిగి తెలుసుకుంటారు.
ఇక అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించినవారి విషయంలోనైతే జ్యోతిష్కులు ఒక అడుగు మందుకేసి వారి వారి జాతకాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని విపులంగా ప్రజలముందు పరుస్తారు.
ఈ క్రమంలో వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు... 2008లో పాప్ గాయని బ్రిట్నీ స్పియర్ భవిష్యత్ ఎలా ఉంటుందో విశదీకరించాడు. ధను రాశికి చెందిన బ్రిట్నీ భవిష్యత్ వచ్చే ఏడాది వెలిగిపోనుందంటున్నాడు. ఆమెకు 2008 సంవత్సరం అన్ని రకాలుగా కలిసివస్తుందనీ, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంటుందనీ అంటున్నాడు.
అంతేకాదండోయ్... బ్రిట్నీ వచ్చే ఏడాది లవ్‌లో పడుతుందట. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయిలో సంతోషాన్ని పొందుతుందట. ఇంకా ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుందట. 2008 సంవత్సరం ద్వితీయార్థంలో మరో కొత్త ఆల్బమ్‌ను బ్రిట్నీ విడుదల చేస్తుందట.