బ్రిటీష్ దర్శకుడుని వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలను ప్రముఖ పాప్ సూపర్ స్టార్ మడోన్నా కొట్టిపారేశారు. గైయ్ రిట్చీ అనే బ్రిటీష్ దర్శకుడని మడోన్నా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో హాజరైన పలు కార్యక్రమాల్లో ఆమె ఇబ్బందులకు గురైంది. ఈ బ్రిటీష్ దర్శకుడు తన భార్యకు విడాకులు ఇచ్చి మడోన్నాతో తిరుగుతున్నట్టు భోగొట్టా. దీనిపై హాలీవుడ్‌కు చెందిన ఒక పత్రికా మడోన్నా ప్రతినిధిని సంప్రదించగా, గైయ్ రిట్చీ తన భార్యతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.
అయితే భార్యకు విడాకులు ఇవ్వడం వల్లే గత వారం రాక్ అండ్ రోల్ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి రిట్చీ ఒక్కరు మాత్రమే హాజరయ్యారని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లు షికార్లు చేస్తుండగా మడోన్నా మాత్రం తన పనిలో నిమగ్నమైవున్నారు. తాను రూపొందిస్తున్న కొత్త ఆల్బమ్‌లో ఆమె లీనమై ఉన్నారని ఆమె ప్రతినిధి స్పష్టం చేసారు.
|