ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటీష్ ఫిల్మ్ దర్శకుడు ఆంథోని మింఘెల్లా మంగళవారం లండన్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. 54 ఏళ్ళ ఆంథోని గత కొంత కాలంగా గొంతు కాన్సర్‌తో బాధపడుతున్నాడని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఆంథోనికి భార్య కరోలిన్, మాక్స్, హానా అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆంథోని ప్రియ స్నేహితుడు బ్రిటీష్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్‌కు వ్యాఖ్యానిస్తూ, బ్రిటన్ సినీ పరిశ్రమ ఒక ప్రముఖ డైరెక్టర్‌ని కోల్పోయిందని అన్నారు. ఆంథోని 1980లో స్క్రిప్ట్ ఎడిటర్‌గా తొలిసారిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయన వ్రాసిన ఎ లిటిల్ లైక్ డ్రానింగ్‌కు థియేటర్ క్రిటిక్స్ అవార్డు పొందడం ద్వారా జీవితంలో కొత్త మలుపు తిరిగింది.
1996లో ఉత్తమ దర్శకునిగా "ది ఇంగ్లీష్ పేషెంట్" చిత్రానికిగాను ఎంపికయ్యారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "ది ఇంగ్లీష్ పేషెంట్" చిత్రం 12 ఆస్కార్ నామినేషన్లను పొందింది. ఈ చిత్రం ఇంతటి ప్రతిభను సాధించడానికి భారీ బడ్జెట్‌ను కేటాయించవలసి వచ్చిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అద్భుత ప్రతిభా పాటవాలు గల ఆంథోని దూరమవడం హాలీవుడ్ పరిశ్రమకే తీరని లోటులాంటిదని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
|