ప్రధాన పేజి > వినోదం > వెండితెర > హాలివుడ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాండ్ ప్రేయసి రేస్‌లో శిల్పకు పాక్ భామ షాక్?
Shilpa
WD PhotoWD
పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి జెమ్స్‌బాండ్ హీరోయిన్‌గా నటించనుందని చెప్పుకుంటున్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ జారా ఆడమ్స్ రానున్న జేమ్స్‌బాండ్ చిత్రంలో హీరోయిన్ అని హాలీవుడ్‌లో హాట్, హాట్‌గా వినిపిస్తోంది.

త్వరలో నిర్మించనున్న జేమ్స్‌బాండ్ చిత్రం క్వాంటం ఆఫ్ సోలేస్ చిత్రంలో జేమ్స్‌బాండ్‌ ముద్దులు అందుకోనున్నది జారానే అని వారు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలోని హీరోయిన్ కోసం నిర్వహించిన సెలక్షన్‌లో జారా ఎంపిక దాదాపు ఖరారైనట్టేనని వారు చెబుతున్నారు.

ఈ విషయమై జారాని కదిలిస్తే జేమ్స్‌బాండ్ చిత్రం కోసం నిర్వహించిన పరీక్షలో తాను తొలిదశను విజయవంతంగా ముగించానని, కాబట్టి తానే జేమ్స్‌బాండ్ జోడీ అని చెప్పింది. అంతేనా చిత్రంలో తాను దాదాపు అరగంట కన్పించనున్నానని కూడా చెప్పింది.

అయితే సాంప్రదాయ ముస్లీం కుటుంబానికి చెందిన మీరు జేమ్స్‌బాండ్ లాంటి శృంగారభరిత చిత్రంలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నిస్తే.... ఈ విషయంలో తన స్నేహితులు తనను బాగా ప్రోత్సహించారని చెప్పింది. అయితే తన తల్లితండ్రులు మాత్రం ఒకింత బాధపడ్డారని, కానీ ఇలాంటి అవకాశం మళ్లీ, మళ్లీ రాదు కాబట్టి వారిని కష్టపడి ఒప్పించానంది.

జేమ్స్‌బాండ్ చిత్రంలో శిల్పాశెట్టి నటించనుందంటూ వార్తలు వచ్చాయి కదాని అడిగితే... జేమ్స్‌బాండ్ హీరోయిన్‌లా నాలుక బయటపెట్టి ఆమెను ఈ చిత్రానికి ఎంపిక చేస్తారని తాను భావించడంలేదని ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
మరిన్ని
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు హేస్టన్ మృతి
పాప్ సింగర్ బ్రీట్నీ స్పియర్ కేసులో మలుపు
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మింఘెల్లా మృతి
పెళ్లి వదంతులను కొట్టేసిన మడోన్న
ఆస్కార్ ఉత్తమ నటిగా ఫ్రెంచ్ సుందరాంగి కోటిలార్డ్
వేశ్య పాత్రలో నటిస్తావా: రెడ్ ఫోర్డ్