ప్రధాన పేజి > వినోదం > వెండితెర > హాలివుడ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'క్యారీ'కి 'కానన్‌'తో పెళ్లి: హాలీవుడ్‌లో ఊహాగానాలు
టెన్నస్సీ చిత్రంతో తాజాగా ప్రేక్షకులను అలరిస్తున్న హాలీవుడ్ సుందరి మారియా క్యారీకి, నిక్ కానన్‌కు మధ్య ఏదో ఉందంటూ హాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య జరిగిన టెన్నస్సీ చిత్రం ప్రీమియర్ షోకు నిక్ కానన్‌తో క్యారీ కలిసి రావడంతో వారి మధ్య ఎఫైర్ ఉన్న మాట నిజమేనన్న పుకార్లకు బలం చేకూరింది. ఈ చిత్రం ప్రీమియర్ షో ముగిసిన తర్వాత జరిగిన పార్టీలో సైతం క్యారీ, నిక్ కానన్‌లు ప్రేమికుల మాదిరిగా ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమన్నట్టుగా ప్రవర్తించే సరికి వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సైతం రావడం ప్రారంభమైంది.

అయితే నిక్ కానన్ ఆ మధ్య మోడల్ సెటీలాతో వ్యవహారం ఎంగేజ్‌మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం క్యారీ నటించిన ఓ ఆల్బమ్‌లో నిక్ ఆమెతో కలిసి నటించాడు. అదిగో అప్పటినుంచి వీరిమధ్య బంధం పెనవేసుకుపోయింది. దీంతో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని
రిచర్డ్ గెరెకు చిక్కులు తెచ్చిన గోడ
బాండ్ ప్రేయసి రేస్‌లో శిల్పకు పాక్ భామ షాక్?
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు హేస్టన్ మృతి
పాప్ సింగర్ బ్రీట్నీ స్పియర్ కేసులో మలుపు
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మింఘెల్లా మృతి
పెళ్లి వదంతులను కొట్టేసిన మడోన్న