ప్రధాన పేజి > వినోదం > వెండితెర > హాలివుడ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నలభైలో ప్రేమలో పడితే: ఫ్లర్టింగ్ విత్40
నలభైలో ఓ స్త్రీ ప్రేమలో పడితే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, తద్వారా ఆమె ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుంది అన్న కథాంశంతో హలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జేన్ పోర్టర్ రాసిన ఓ నవల ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటి హెదర్ లాక్‌లియర్ టైటిల్ పాత్ర పోషిస్తోంది.

ఈ చిత్రంలో హెదర్ ఇద్దరు పిల్లలకు తల్లి పాత్ర పోషిస్తోంది. భర్తతో గొడవపడడం ద్వారా విడిపోయిన హెదర్ తనకంటే చిన్నవాడేన ఓ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. దీంతో కథ మలుపు తిరుగుతుంది.

నలభై ఏళ్ల స్త్రీ ప్రేమలో పడ్డప్పుడు జరిగే కథాంశాన్ని దర్శకుడు రొమాంటిక్‌గా తెరకెక్కిస్తున్నారట. రొమాంటిక్ సన్నివేశాల్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం విందు కానుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రం చూడాలంటే మాత్రం కొన్ని నెలలు ఆగాలి మరి.
మరిన్ని
'క్యారీ'కి 'కానన్‌'తో పెళ్లి: హాలీవుడ్‌లో ఊహాగానాలు
రిచర్డ్ గెరెకు చిక్కులు తెచ్చిన గోడ
బాండ్ ప్రేయసి రేస్‌లో శిల్పకు పాక్ భామ షాక్?
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు హేస్టన్ మృతి
పాప్ సింగర్ బ్రీట్నీ స్పియర్ కేసులో మలుపు
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మింఘెల్లా మృతి