తన భార్య నుంచి విడిపోయానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్‌క్రూయిజ్ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు.
ఇటీవల కొంతకాలంగా టామ్ తన భార్యతో కలిసి ఉండడం లేదని, ఆయన తన భార్య నుంచి విడిపోయారని హాలీవుడ్‌లో పుకార్లు షికారు చేయడం ప్రారంభించాయి. టామ్, ఆయన భార్య హోమ్స్ విడిపోవడానికి నిర్ణయించుకున్నారని అందుకే వారు విడిగా ఉంటున్నారని కూడా చెప్పుకోవడం ప్రారంభించారు.
అయితే ఇలాంటి తరుణంలో టామ్ ఇవన్నీ వట్టి పుకార్లేనని చెప్పుకొచ్చారు. అమెరికాలోని ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న టామ్ మాట్లాడుతూ తాను, తన భార్య ఒకే ఇంటిలో కలిసున్నామని కాపురం కూడా చేస్తున్నామని నవ్వుతూ చెప్పారు.
తమ దాంపత్య జీవితం గురించి ఇతరులతో బహిరంగంగా మాట్లాడడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టడానికే తాను ఈ విషయం చెప్పానని కూడా ఆయన తెలిపారు.
|