ప్రముఖ పాప్‌గాయని బియాన్స్ పెళ్లి చేసుకుంది. ఇందులో ఆశ్యర్యమేముంది అనుకోకండి. ఇందులో ఓ విశేషముంది బియాన్స్ పెళ్లి రహస్యంగా జరగడమే ఆ విశేషం. తన ప్రియుడు జేజెడ్‌తో రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు తాజాగా తమ పెళ్లి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేవరకు ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు.
అయితే ఈమె పెళ్లి చేసుకున్న విషయం తమకు ముందే తెలుసని కొందరు చెబుతున్నారు. చాలా రోజుల క్రితమే జేజెడ్‌తో బియాన్స్ పెళ్లి జరిగిందని వాళ్లిద్దరూ కలిసి అరి జోనాలోని ఓ రిసార్ట్స్‌లో హనీమూన్ కూడా చేసేసుకున్నారని వారు చెబుతున్నారు.
విషయం ఏదైనా బియాన్స్ అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమెను ఎరిగినవారు అనుకుంటున్నారట. అయితే హాలీవుడ్‌లో ఇలా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం సహజమే అని మరికొందరు ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నారట.
|