అలనాటి హాలీవుడ్ నటి, అస్కార్ గ్రహీత హాలిహంటర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. సినిమాలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె పేరుతో ఉన్న శిలాఫలకాన్ని హాలీవుడ్ బౌల్వార్డ్‌లో ఉంచారు.
ఈ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి హాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడు స్టివెన్ స్పీల్‌బర్గ్, నటుడు ఎడ్ హారిస్‌లు విచ్చేశారు. ఈ సదర్భంగా వారు హాలిహంటర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాలిహంటర్ తన ఇద్దరు కవలపిల్లలతో కలిసి విచ్చేసింది.
ఇప్పటికీ అందంగా కనిపించే 50 ఏళ్ల హాలిహంటర్ 1993లో ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ది పియానో చిత్రంలో ఆమె పోషించిన మూగ పాత్రను ప్రశంసిస్తూ ఆమెకు ఈ అవార్డ్ లభించింది.
|