పాప్ మ్యూజిక్ ప్రపంచానికి మహరాణి అయిన మడోన్నా పాప్ యువరాణి బ్రిట్నీని టూర్ కెళదాం రమ్మని ఆహ్వానం పలుకుతోంది. మడోన్నా బ్రిట్నీకి ఇలా దారి చూపించే ప్రయత్నం చేస్తోందనీ ఆమె స్నేహితులు అంటున్నారు. 49 ఏళ్ల మడోన్నా 26 ఏళ్ల బ్రిట్నీతో న్యూయార్క్‌లో చేయబోయే రికార్డు పెద్ద తెరపై ఆగస్టు 23న ఆవిష్కృతం కానుంది.
ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాను పాల్గొనబోయే పర్యటనల్లో భాగస్వామికావల్సిందిగా బ్రిట్నీని కోరింది. ఇద్దరూ కలిసి ఈ ఆదివారం ఓ వీడియోను రికార్డు చేయనున్నారని బ్రిట్నీ సన్నిహితుడొకరు చెప్పారు. అంతేకాదు కొన్ని విదేశీ పర్యటనల్లో మడోన్నాతో కలిసి బ్రిట్నీ పాల్గొనే అవకాశంపై చర్చించినట్లు తెలిపాడు.
మడోన్నా, బ్రీట్నీలు కలిసి మరోసారి పాప్ ప్రియుల గుండెల్లో వేడి రగిలిస్తారంటున్నారు. ఈ విధంగా బ్రిట్నీకి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మడోన్నాను అందరూ కొనియాడుతున్నారు. ఎంతైనా సహపాప్ గాయనీ కదా... ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా మరి...
|