'వీడియో షూటింగ్‌లో పాల్గొంటావా' అన్న మడోన్నా పిలుపుకు అమెరికన్ హాట్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ "ఊ...." అంది. త్వరలో మడోన్నాతో కలిసి 'స్టిక్కీ & స్వీటీ' అనే వీడియో షూటింగ్‌లో పాల్గొననున్నానని చెప్పింది. అంతేకాదు మడోన్నా రూపొందించబోయే చిత్రంలో తాను నటించబోతున్నాననీ అంటోంది. అయితే ఆ చిత్రంలో ఇద్దరూ కలిసి నటిస్తారా... అసలు ఎప్పుడు తీయబోతున్నారు... ఇత్యాది విషయాలు మాత్రం తెలియరాలేదు.
ఈ విషయంపై బ్రిట్నీని కదిలిస్తే... "నాకైతే తెలియదు. ఒకవేళ తెలిసినా చెప్పను. ఇట్స్ ఎ సీక్రెట్" అంది. అయితే మడోన్నా, బ్రిట్నీలు కలిసి వీడియో షూటింగ్‌లో పాల్గొనటం కొత్తేమే కాదు. 2003 ఎంటీవి అవార్డు ప్రదానోత్సవాల సమయంలో స్టేజిపై ఇరువురు కలిసి పాప్ ప్రియులను ఉర్రూతలూగించారు. ఆ సమయంలో బ్రాడ్‌కాస్ట్ అయిన ఓ 'మధురమైన ముద్దు'ను ఎవ్వరూ మరిచిపోలేరు.
|