1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. హాలివుడ్

కాలేజీకి వెళుతున్న స్పైడర్‌మాన్

కాలేజీకి వెళుతున్న స్పైడర్‌మాన్
WD
ఒకసారి యాక్టర్ అయిన తర్వాత మళ్లీ తిరిగి చదువు సంధ్యలంటూ బడికి వెళ్లే నటీనటులు చాలా అరుదు. అందునా అగ్రస్థానంలో వుండి అంతర్జాతీయ గుర్తింపు సాధించిన వారు తిరిగి చదువు సాగించటం గొప్ప విషయమే.

అసలు సంగతి ఏంటయా అంటే... ఆ భవనం మీది నుంచి ఈ భవనం మీదికి నింగిలో తిరుగాడే స్పైడర్‌మాన్‌గా నటించిన జేమ్స్ ఫ్రాంక్ తన గ్రాడ్యుయేట్ కోర్సును ముగించటానికి న్యూయార్క్ యూనివర్శిటీకి పుస్తకాలను చంకన పెట్టుకుని వెళుతున్నాడు. అప్పట్లో సినిమాల్లో నటించేందుకంటూ చదువుకు బైబై చెప్పినందుకు 'స్పైడర్‌మాన్' తల్లిదండ్రులు తెగ ఫీలైపోయారట. వారిని సంతృప్తిపరిచేందుకే మళ్లీ తాను కాలేజీకి వెళుతున్నాని చెప్పాడు.

న్యూయార్క్ డైలీ న్యూస్ అడిగిన ఓ ప్రశ్నకు... "నేను మళ్లీ స్కూలుకు వెళుతున్నా. ఎవరెవరి ఇష్టాలు ఎలా వుంటాయో తెలుసుకోవడంతోపాటు... నాకు ఏదైతే ఇష్టమో దానినే చేయబోతున్నాను. నాకంటూ కొన్ని ఇష్టాలున్నాయి. నిజానికి కాలేజీలైఫ్ మరో పదేళ్ల తర్వాత రమ్మన్నా రాదు. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలి. అందుకే నేను తిరిగి కాలేజీకి తిరిగి వెళుతున్నాను" అన్నాడు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT