గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » కొత్త సోయగాలపై బ్రిట్నీ శ్రద్ధ!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన సోయగాలను వన్నెతెచ్చుకోవడంపై మరింత శ్రద్ధ చూపుతుందట. చాలాకాలం విరామం తర్వాత ఎంటీవీ అవార్డుల వేదికపై తన సొగసులతో ప్రేక్షకులను, శ్రోతలను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తన శరీర సౌష్టవాలను మెరుగు పరుచుకోవడం కోసం జిమ్, డ్యాన్స్ స్టూడియోలకు వెళుతోందట.

ఇంకేముంది... తాజాగా విడుదలకు సిద్ధమైన "వుమనైజర్" ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో బ్రిట్నీ తన అందచందాలతో శ్రోతలను, ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే "వుమనైజర్" ఆల్బమ్ నిర్వాహకులు బ్రిట్నీ స్పియర్‌లో పాత తేజాన్ని, వయ్యారాన్ని ఏమాత్రం ఒలికిపోకుండా, వేదికపైకి తేవాలని కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా, ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో... ఈ పాప్ సింగర్ బ్రిట్నీ లెధర్‌తో తయారైన కురుచ దుస్తులతో వేదికపై కనిపించనుంది. ముందుగా స్పియర్స్ "వుమనైజర్" ఆల్బమ్‌ను ఈ నెల ( సెప్టెంబర్) 22న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే.. బ్రిట్నీ తాజా ఆల్బమ్‌లోని ఓ పాటను ఆన్‌లైన్‌‌లో లీక్ చేయడంతో, ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఈ నెల 29కి వాయిదా పడింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ సోయగాలు శ్రద్ధ ముద్దుగుమ్మ