గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » నా "ఉమనైజర్" బాలికల గీతం: బ్రిట్నీ
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రముఖ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తాజాగా విడుదల చేయనున్న తన "ఉమనైజర్" ఆల్బమ్‌ను బాలికల గీతంగా అభివర్ణిస్తోంది. తాను బాలిక దశలో పలు పరిణామాలను ఎదుర్కున్నానని, ఈ ఆల్బమ్ యువతులకు కొత్త ఊతమిస్తుందని బ్రిట్నీ వెల్లడించింది.

బాలికలపై దౌర్జన్యం చెలాయించే మగరాయళ్లకు ఈ ఆల్బమ్ బుద్దిచెప్పే విధంగా ఉంటుందని బ్రిట్నీ న్యూయార్క్‌కు చెందిన జెడ్100 రేడియో స్టేషన్‌తో తెలిపింది. ఇంకా చెప్పాలంటే.. యువతలను మోసగించే పొగరుమోతుల నుంచి తమను తాము రక్షించుకునే విధంగా తన ఆల్బమ్‌లోని పాటలుంటాయని స్పియర్స్ చెప్పింది.

మగాళ్ల ఆధిపత్యం నుంచి యువతులను తప్పించి, వారిని చైతన్యవంతులు చేసేందుకు తన "ఉమనైజర్" ఆల్బమ్ వారధిగా ఉంటుందని బ్రిట్నీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇకపోతే.. డిసెంబరులో బ్రిట్నీ స్పియర్స్ "ఉమనైజర్" ఆల్బమ్ విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, స్పియర్ తల్లి "లిన్నె" తన ఆత్మకథలో బ్రిట్నీ గతకాలాన్ని పేర్కొన్నారు. టీనేజ్‌లో బ్రిట్నీ జీవితంలో నెలకొన్న పరిస్థితులపై లిన్నె "త్రూ ది స్టార్మ్"లో విశదీకరించారు. బ్రిట్నీ కష్టాలు ఆమె టీనేజ్‌ జీవితంలోనే దాగి ఉన్నాయని లిన్నె తన ఆత్మకథలో ఇటీవల పేర్కొన్నారు.

మరోవైపు... ఈ అమెరికన్ హాట్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌కు మూడు ఎంటీవీ అవార్డులు లభించాయి. వీడియో ఆఫ్ ది ఇయర్, బెస్ట్ పాప్ వీడియో, బెస్ట్ ఫిమేల్ వీడియో విభాగాల్లో బ్రిట్నీ అవార్డులను దక్కించుకున్న విషయం విదితమే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఉమనైజర్ బాలికల గీతం యువతులు మగరాయళ్లు బుద్ది