గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » బ్రిట్నీ స్పియర్స్ పై 6 నెలలపాటు సెక్స్ నిషేధం
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
పాప్ సంగీత రేరాణి బ్రిట్నీ స్పియర్స్ లైంగిక కార్యకలాపాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించాలని ఆమె తల్లిదండ్రులు జామీ, లిన్ స్పియర్స్‌లు నిర్ణయించారు. పూర్తిగా మానసికోన్మాద స్థితి ఆవరించిన బ్రిట్నీకి సహాయపడేందుకోసం ఆమె వ్యక్తిగత, వృత్తిపర వ్యవహారాలను స్పియర్స్ దంపతులు ఈ సంవత్సరం మొదట్లో తమ అదుపులోకి తీసుకున్నారు.
పిచ్చి ప్రియ.. ప్రబుద్ధ మగాడు
  పాతికేళ్లు నిండని నవ యవ్వన జీవితం.. సెలబ్రిటీ లైఫ్.. మత్తు, మధువు, మగాడు, మాదక ద్రవ్యాలు, ఉన్మాదం వెరసి బ్రిట్నీ స్పియర్స్ అలియాస్ పాప్ రేరాణి. మరోవైపు పొందుకూడిన క్షణాలను కూడా ఫోటో తీయగల నెంబర్ వన్ ప్రబుద్ధుడు అద్నాన్ గాలిబ్... జీవితానందం అంటే ఇదేనా...      


తమ కూతురు త్వరితంగా కోలుకున్నందుకు సంతోషిస్తున్న స్పియర్స్ దంపతులు ఆమె పాత ప్రియుడు అద్నాన్ గాలిబ్ వంటి వ్యక్తులతో ఆమె డేటింగ్‌కు దిగకుండా చేయాలని భావిస్తున్నారు. పాపరాజ్జీగా -ఫోటోగ్రాఫర్- ఉన్న ఆమె మాజీ ప్రియుడు అద్నాన్ చివరకు ఆమెతో తను గడిపిన సెక్స్ క్షణాలను సైతం రికార్డు చేసి ఇటీవల దానిని అమ్మేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

పురుషుల ఎంపికలో కూతురు తప్పటడుగులకు భయపడిన స్పియర్స్ దంపతులు ఆమె మళ్లీ తప్పుడు మనుషులతో సంబంధాల్లోకి వెళితే ఆమె ఆరోగ్య స్థితి కుప్పగూలుతుందని భావిస్తున్నారు. బ్రిట్నీ పబ్లిక్ లైఫ్ కుప్పకూలిపోయేందుకు ఆమె మాజీ ప్రియుడు ఆద్నాన్ గాలిబ్ పాక్షికంగా కారకుడు అని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు.

ఈ ప్రబుద్ధ ఫోటోగ్రాఫర్‌తోను, అతడి మేనేజర్ శామ్ లుట్ఫి చుట్టూతా తిరుగుతున్నంత సేపు తమ కూతురు తమకు ఇక దక్కదనే భావించినట్లుగా స్పియర్స్ దంపతులు చెప్పారు. తమ కూతురు మళ్లీ ప్రజాజీవితంలో స్థిరపడే క్షణాలు సమీపిస్తున్నందున ఆమె దారికి ఎలాంటి అడ్డు ఎదురుకావడం వారికి ఇష్టం లేదని డెయిలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.

బ్రిట్నీ తన చిన్ని జీవితంలో ఎదుర్కొన్న కాళరాత్రులు తిరిగి ఆమెకు ఎదురు కాకూడదని వారు భయపడుతున్నారని పత్రిక తెలిపింది. డబ్బుకోసం లేదా తమ స్వంత కెరీర్ కోసం తనను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిన వారితో సంబంధంలోకి వెళ్లడమే బ్రీట్నీ కొంప ముంచిందని స్పియర్ దంపతులు నమ్ముతున్నారు.

ఈ భావనతోటే మరో ఆరునెలల పాటు కూతురు సెక్స్ జీవితం గడపకుండా అదుపులో ఉంచాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లుగా డైలీ టెలిగ్రాఫ్ పేర్కొనడం విశేషం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం హలీవుడ్ పాప్ సంగీతం బ్రిట్నీ స్పియర్స్ అద్నాన్ గాలిబ్ పాపరాజ్జీ సెక్స్ డైలీ టెలిగ్రాఫ్ డేటింగ్ నిషేధం