గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ది ఎక్స్ ఫ్యాక్టర్.. ఉమనైజర్... బ్రిట్నీ
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
బ్రిట్నీ స్పియర్స్... పాప్ స్టార్స్‌లోకెల్లా సూపర్ స్టార్. ఆమె త్వరలో ప్రపంచ యాత్రకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత బ్రిట్నీ సరికొత్తగా కనిపించబోతోందని దేశరాజధాని ఢిల్లీలో సిమన్ కొవెల్ ప్రకటించాడు.

తన పాప్ సాంగ్స్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిట్నీ ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే వాటివల్ల తాత్కాలికంగా ఆమె కుంగిపోయినా ప్రస్తుతం ఆ చీకటి ప్రపంచం నుంచి బయటపడింది. తన కోసం ఎదురుచూస్తున్న పాప్ ప్రియులను సంతోషపెట్టడానికి సమాయత్తమవుతోంది.

ఈ క్రమంలో ఆమె బ్రిటన్‌లో జరుగనున్న "ది ఎక్స్ ఫ్యాక్టర్" టాలెంట్ షోలో దర్శనమిచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నెం.1 సింగిల్ "ఉమనైజర్"ను చైనాలో ప్రదర్శించనుంది. మొత్తమ్మీద బ్రిట్నీ ఆగమనం పాప్ సంగీత ప్రియులలో ఉత్సాహాన్ని రేకిత్తిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ హాలీవుడ్ టాలెంట్ షో సినిమా వార్తలు