ప్రముఖ పాప్ గాయని మడోన్నా-గైరిచీల మధ్య విడాకులైన సంగతి తెలిసిందే. మడోన్నా దంపతుల మధ్య శృంగార సుఖం కరువైనందువల్లే వారి వైవాహిక బంధం విడాకులకు దారితీసిందని ఓ బ్రిటిష్ పత్రిక ఇటీవల పేర్కొంది. భర్త కన్నా తనకు జిమ్మే ముఖ్యం అంటూ మడోన్నా భావించడంతోనే ఆమె భర్త గైరిచీ విడాకులకు సిద్ధమయ్యాడని ఆ పత్రిక వెల్లడించింది.
మరోవైపు... గైరిచీ విపరీతంగా మద్యం తాగడం, తనను, తన పిల్లలను అసలు పట్టించుకోకపోవడంతోనే మడోన్నా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో... గైరిచీతో విడిపోయిన మడోన్నా మాజీ భర్తతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు భోగట్టా. గైరిచీకి దూరమైన మడోన్నా, మళ్లీ సీన్‌పెన్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోందట. వీరిద్దరూ కలిసి ఈ మధ్య ఓ హోటల్లో డ్రింక్స్ తాగుతూ కనిపించారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అంశంపై మడోన్నా స్పందిస్తూ... మా ఇద్దరి మధ్య స్నేహం తప్పనిస్తే... ఇంకేం లేదని వెల్లడించిందట.
ఇదిలా ఉండగా.. పలువురితో ప్రేమాయణం కొనసాగించిన మడోన్నా, తొలుత నటుడు సీన్‌పెన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తదనంతరం ఆయనకు విడాకులిచ్చిన ఈ పాప్ గాయని 2000 డిసెంబరులో బ్రిటన్ దర్శకుడు గైరిచీని వివాహమాడింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.