గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » యూకేలో బ్రిట్నీ స్పియర్స్ సంగీత యాత్ర!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన ప్రపంచ సంగీత యాత్రలో భాగంగా యూకేలోనూ పర్యటించనుందట. గత ఐదేళ్ల విరామం తర్వాత వేదికపై రానున్న స్పియర్స్ పర్యటన కోసం ఆమె అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. యూకేలో బ్రిట్నీ స్పియర్స్ నిర్వహించే ఈ మ్యూజికల్ ప్రోగ్రామ్‌కు డిసెంబరు ఐదో తేదీ నుంచి టిక్కెట్ల విక్రయం జరుగనుంది.

మరోవైపు... యూకేలో జరుగనున్న స్పియర్స్ షోను వీక్షించే ఛాన్స్‌ను ఆమె అభిమానులు మిస్ చేసుకోరని, ఈ షో టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇకపోతే... బ్రిట్నీ స్పియర్స్ ఆరో ఆల్బమ్ "సర్కస్" ఆమె పుట్టినరోజైన డిసెంబర్ రెండో తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. తండ్రి జామీ నీడలోనే బ్రిట్నీ ఉండాలని, ఆమె ఆస్తిని జామీ తన ఆధ్వర్యంలో కాపాడాలని లాస్ ఏంజెల్స్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా బ్రిట్నీ మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఆల్బమ్‌ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం తాను జీవిస్తున్న జీవితం తనకు ఏమాత్రం నచ్చడం లేదని, గూటిలో చిలుకలా ఉందని బ్రిట్నీ ఆందోళన వ్యక్తం చేసినట్లు టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. అంతేకాకుండా ఈ జీవితంలో తనకు ఏమాత్రం స్వతంత్రత లేదని స్పియర్స్ వాపోయినట్లు ఆ పత్రిక పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ యూకే బ్రిట్నీ స్పియర్స్ సంగీత యాత్ర అభిమానులు ఆరో ఆల్బమ్ సర్కస్ డిసెంబర్