సంతానలక్ష్మి మళ్లీ గర్భవతైందంటే... ఇదేంటబ్బా అనుకుంటున్నారా..? నిజమేనండీ... ఇంతకీ ఎవరండీ ఆ సంతాన లక్ష్మి అంటున్నారా? ఆమే ఏంజెలీనా జూలీ. హాలీవుడ్ హాట్ స్టార్ ఏంజెలీనా జోలీ మూడు నెలల గర్భవతి అంటూ ఓ అమెరికన్ పత్రిక సంచలనాత్మక కథనం ప్రచురించింది.
కానీ ఈ విషయాన్ని జోలి బ్రాడ్‌పిట్‌ల అధికార ప్రతినిధి ఖండించారు. "ఇన్ టచ్" అనే ఈ వార పత్రికే గతంలో జోలీ రెండోసారి గర్భం దాల్చి కవలలను కనబోతున్న విషయాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చింది. ఈ నటీమణి తన ఏడో సంతానానికి కొత్త సంవత్సరంలో జన్మనిస్తుందని కూడా ఆ కథనంలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, అమెరికన్ పత్రిక ప్రచురించిన వార్తను జోలీ, పిట్‌ల ప్రతినిధి ఖండిచినప్పటికీ... ఆ పత్రిక పదే పదే ఇదే విషయాన్ని రాస్తూనే ఉందట. ఇకపోతే... జూలీ దంపతులకు ఇప్పటికి ముగ్గురు దత్తత సంతానం ఉండగా, మరో ముగ్గురు సొంత పిల్లులు ఉన్నారు. వీరిలోనే వివి ఎన్నే, నాక్స్ అనే ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.