గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » బాలీవుడ్ సినిమా‌లో కెనడా మోడల్..!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
బాలీవుడ్ సినీరంగం నుంచి హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే సినీ తారలు పెరిగిపోతున్న నేపథ్యంలో... కెనడాకు చెందిన రేచెల్ అనే మోడల్ బాలీవుడ్‌లో నటించనుంది. కెనడాలో ఉంటున్న భారత సంతతికి చెందిన రేచెల్.. ఇప్పటికే ఒక హిందీ ప్రాజెక్ట్‌లో సంతకం చేసినట్టు సమాచారం.

తన అందచందాలతో మగరాయుళ్ళ గుండెల్లో గుబులు పుట్టించే ఈ ముద్దుగుమ్మ పిన్-అప్ బికినీ మోడెల్‌గా ముద్రవేసుకుంది. ఆటో, బైక్ షోలలో పాల్గొనే ఈ ముద్దుగుమ్మను తన చిత్రంలో నటించాల్సిందిగా ప్రముఖ నిర్మాత జాన్ అబ్రహాం అడిగారని సమాచారం.

జాన్ అబ్రహాం నిర్మించే తాజా చిత్రంలో రేచెల్‌తో పాటు దినో మొరియా, రాహుల్ బోస్‌లు నటిస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొన్ని దేశ వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన ఈ మోడల్, మూడేళ్లపాటు బాలీవుడ్ ప్రాజెక్టు కోసం నటించనుందట. దీనికి సంబంధించి ముంబైలో యాక్టింగ్ కోర్సుకు కూడా వెళ్తుందట. రేచేల్ నటించనున్న కొత్త చిత్రం ఫ్యామిలీ, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా రేచేల్ స్పందిస్తూ... తనకు బాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టమని, బాలీవుడ్ యంగ్ హీరో సల్మాన్, అమీర్, ఎస్ఆర్‌కెలు నటించిన సినిమాలను చాలా ఇష్టపడి చూస్తానంది. భారతీయ చిత్రరంగంలో నటించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని రేచేల్ చెప్పింది. ఈ చిత్రంలో ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ తాను కన్పించనున్నట్లు ఆమె వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ బాలీవుడ్ సినిమా కెనడా మోడల్ రేచెల్ జాన్ అబ్రహాం రాహుల్ బోస్ సల్మాన్ అమీర్