గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » అత్యధిక పారితోషికం పుచ్చుకోవడంలో జోలీ ఫస్ట్!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ సెక్సీక్వీన్ ఏంజెలీనా జోలీ అత్యధిక పారితోషికం పుచ్చుకునే జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. "టామ్ రైడర్" హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన సర్వేలో జోలీకి ప్రథమ స్థానం దక్కింది. ఇదే సర్వేలో రెండో స్థానంలో జూలియా రాబర్ట్స్, రెస్సీ విథెర్‌స్పూన్ (3), కెమరాన్ డియాజ్ (4), కెథరీన్ హైజిల్ ఐదోస్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది (2008) ఏంజెలీనా జోలీ దాదాపు ఒక బిలియన్ డాలర్లను పారితోషికంగా పుచ్చుకుందని, ప్రతి ఒక్క సినిమాకు ఆమె 15 మిలియన్ డాలర్లను రెమ్యునరేషన్ కింద తీసుకుంటుందని సర్వే వెల్లడించింది.

ఇంకా.. గత ఏడాది టాప్‌లో ఉన్న విథర్‌స్పూన్ మూడో స్థానంలోకి చేరుకుంది. అదేవిధంగా.. ఐదో స్థానంలో నిలిచిన కెథరీన్ 13 మిలియన్ల పారితోషికాన్ని స్టీవెన్స్ ఆన్ గ్రేస్ అనాటమి చిత్రానికి పుచ్చుకుందని ఆ సర్వే తెలిపింది.

ఇదిలా ఉండగా... జోలీ ఆరోగ్యంపై హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికావడంతో బ్రాడ్ లండన్‌లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడట. జూలీ అనారోగ్యంతో కంటతడిపెట్టడం బాధేసిందని బ్రాడ్ మీడియాతో అన్నాడట.

తన భాగస్వామి అయిన జూలీ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్షని బ్రాడ్ వెల్లడించాడు. గత రెండు వారాలుగా జూలీకి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని, ఆమె తీవ్ర ఒత్తిడికి గురవటమే దీనికి కారణమని బ్రాడ్ అన్నాడు. తరచూ ప్రయాణాలు చేయడం, షూటింగ్‌ల్లో పాల్గొనడంతో తన ఆరుగురు సంతానాన్ని కూడా సరిగ్గా చూసుకోలేక పోతుందని బ్రాడ్ వాపోయాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ అత్యధిక పారితోషికం జోలీ ఫస్ట్ సెక్సీక్వీన్ ఏంజెలీనా జోలీ టామ్ రైడర్ హాలీవుడ్ రిపోర్టర్