ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ "సర్కస్" ఆల్బంతో సంచలనం సృష్టించింది. ఆల్బం విడుదలైన మొదటి వారంలోనే ఐదులక్షల కాపీలు అమ్ముడుపోవడంతో బ్రిట్నీ స్పియర్స్ ఆనందానికి అంతులేదు. ఇప్పటికే విడుదలైన నాలుగు ఆల్బంలతో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని రాజ్యమేలిన బ్రిట్నీ, గత కొంత కాలం ఆ స్థానానికి విరామం ఇచ్చింది.
తిరిగి తన ఐదో "సర్కస్" ఆల్బంతో వేదికపైకి వచ్చిన స్పియర్స్, ప్రేక్షకులను, శ్రోతలను అనుకున్న విధంగానే ఆకట్టుకుని ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంది. బ్రిట్నీ ఆల్బం ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని ఆమె అభిమానులు తీక్షణంగా ఎదురుచూస్తుండగా... డిసెంబర్ మొదటి వారంలో బ్రిట్నీ స్పియర్స్ "సర్కస్" ఆల్బంలాంఛనంగా విడుదలైంది.
రిలీజ్ అయిన మొదటి వారంలోనే "సర్కస్" ఆల్బంకు చెందిన 5 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. దీంతో బ్రిట్నీకి నెం.1 స్థానాన్ని సంపాదించి పెట్టిన ఐదవ ఆల్బమ్‌గా "సర్కస్" నిలవడం విశేషం. ఇప్పటికే విడుదలైన బ్రిట్నీ నాలుగు ఆల్బంలు కూడా ఐదు లక్షల కాపీలకు పైగా అమ్ముడు పోవడం గమనార్హం.