ప్రముఖ పాప్ గాయని, అందాల ముద్దుగుమ్మ బ్రిట్నీ స్పియర్స్, హాలీవుడ్ నటి మడోన్నాను అనుసరిస్తోందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మధ్య హాలీవుడ్ హాట్ స్టార్ మడోన్నా కాస్ట్యూమ్స్‌ను తలపించే రీతిలో బ్రిట్నీ డ్రెస్ చేసుకుంటోందట.
అవార్డు ఫంక్షన్లు, సినీ కార్యక్రమాలకు వెళ్లే సమయంలో హాలీవుడ్ తారలు ప్రేక్షకులను ఆకర్షించే రీతిలో దుస్తులు ధరించడం పరిపాటే. ఇందులో భాగంగా... మడోన్నా వాడే కాస్ట్యూమ్స్‌ను బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి ధరించి హాజరైంది.
గతనెల జర్మనీలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కు ఈ 27 ఏళ్ల పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ప్రేక్షకులను, శ్రోతలను అలరించే దుస్తులను ధరించింది. అంతేగాకుండా... తన సూపర్ హిట్ ఆల్బమ్ "సర్కస్" విడుదల కార్యక్రమంలోనూ మడోన్నా తరహా సెక్సీ డ్రస్సును బ్రిట్నీ ధరించిందని సన్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇకపోతే... మడోన్నా, బ్రిట్నీస్పియర్స్ దుస్తులు మ్యాచ్ అవుతుండటంతో... మడోన్నా బాటను స్పియర్స్ అనుసరిస్తోందని హాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల "స్టిక్కీ అండ్ స్వీట్" టూర్‌లో మడోన్నా ధరించిన కాస్ట్యూమ్స్ తరహాలోనే "సర్కస్" ప్రమోషనల్ టూర్‌లో బ్రిట్నీ ధరించిందని సన్ పత్రిక తెలిపింది.