ప్రముఖ పాప్ గాయని, హాలీవుడ్ అగ్రనటి మడోనా పాప్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. తన అందచందాలతో పాటు తన మధురమైన స్వరంతో యువతను మత్తెక్కింటే ఈ భామ, పాప్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని "కాంటాక్ట్ మ్యూజిక్" పేర్కొంది.
తాజాగా "కాంటాక్ట్ మ్యూజిక్" నిర్వహించిన పోల్‌లో... ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో సంగీతయాత్ర చేపట్టిన మడోనా అత్యున్నత స్థానాన్ని సొంతం చేసుకుంది. 2008లో మడోనా ప్రదర్శించిన 58 పాప్ షోలకు ఆమె 105.3 మిలియన్లు సంపాదించింది. "స్టికీ అండ్ స్వీట్" పేరిట మడోనా చేసిన ప్రపంచ సంగీత యాత్ర గతవారం బ్రెజిల్‌లో ముగిసింది.
మడోనా తర్వాతి స్థానాన్ని 24 దేశాలలో ఈ ఏడాది ప్రదర్శనలు చేపట్టిన కెనడియన్ పాప్ గాయని సెలినె డయాన్ దక్కించుకుంది. మూడో స్థానంలో రాక్ సంగీతంలో సుప్రసిద్ధులైన "ది ఈగల్స్" (73.4 మిలియన్లు) బృందం నిలిచింది.
ఇదేవిధంగా... కెన్నీ చెస్నీ (72.2 మిలియన్లు), బోన్ జోవీ (70.4 మిలియన్లు)లు నాలుగైదు స్థానాలను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే... 6, 7, 8, 9, 10, స్థానాల్లో బ్రూస్ స్పింగ్‌స్టీన్ (69.3 మిలియన్లు), నెయిల్ డైమెండ్ (59.8 మిలియన్లు), రాస్కెస్ ఫ్లాట్స్ (55.8 మిలియన్లు), ది పోలీస్ (48.0 మిలియన్లు), తినా టర్నర్ (47.7 మిలియన్లు) నిలిచారు.