గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌తో బ్రిట్నీ డేటింగ్...!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
హాలీవుడ్ తార, ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ బాలీవుడ్ నృత్యదర్శకుడు సందీప్ సోపార్కర్‌తో ప్రేమాయణంలో పడిందని వార్తలు. బ్రిట్నీ ఇటీవలే రూపొందించిన ఉమనైజర్ వీడియో ఆల్బమ్‌‌కు సందీప్ నృత్యదర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 27 ఏళ్ల ఈ పాప్ రాణి మూడు రోజుల పాటు క్రిస్‌మస్ సెలవులలో సందీప్‌తో గడిపేందుకోసం జోధ్‌పూర్‌కి వచ్చింది.

ఈ ఇద్దరూ గత మూడువారాలుగా డేటింగ్ చేస్తున్నారని ది మిర్రర్ పత్రిక తెలిపింది. ఇరువురూ ఈ సందర్భంగా చెట్టుకింద పరస్పరం బహుమతులు అందజేసుకున్నారట. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం ఇటీవలే ప్రారంభమైనప్పటికీ రోజురోజుకూ ఇరువురి బంధం బలోపేతమవుతోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

తమ సంబంధాన్ని సాధారణ దంపతుల మధ్య స్నేహ సంబంధంలాగే కొనసాగించాలని బ్రిట్నీ, సందీప్ నిర్ణయించుకున్నందున భారత్‌లో తమ కలయిక గురించి వీరు పెద్దగా ఆర్భాటం చేయలేదని సన్నిహితులు చెప్పారు. సందీప్ చాలా సాదా సీదాగా ఉండే మనిషి. పైగా అతడిలోని దైవచింతన, సున్నిత స్వభావం బ్రిట్నీకి అమితంగా నచ్చేసిందట.

క్రిస్‌మస్ రోజు రాత్రంతా వీరు కబుర్లాడుకుంటూ సన్నిహితంగా గడిపారు. భారతీయ వంటకాలైన చికెన్ టిక్కా, చీజ్ కర్రీని శాండీ ఆర్డర్ చేసి బ్రిట్నీచే తినిపించాడు. బ్రిట్నీ ఎంతో చొరవగా సందీప్ ప్లేట్ లోంచి స్నాక్స్ తీసుకుని తినడం గమనించిన పలువురు ఔరా అనుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

క్రిస్‌మస్ సందర్భంగా బ్రిట్నీకి సందీప్ చక్కటి చీర బహుకరించగా ఆ చీర కట్టుకుని ఆమె అతడితో కలిసి కాండిల్ లైట్ డిన్నర్‌లో పాల్గొన్నారు. గత సంవత్సరం మొదట్లో అమెరికన్ పాప్ గాయని మడోన్నా ఇచ్చిన ఓ పార్టీ సందర్భంగా సందీప్‌ను బ్రిట్నీ కలిశారు. కాగా నూతన సంవత్సరాన్ని ఆమె లాస్ ఎంజెల్స్‌లో గడిపింది.

భారత్ నుంచి తిరిగి అమెరికా వెళ్లేటప్పుడు బ్రిట్నీ మూడు కేజీల ఖుర్మా, కొన్ని కేకులను తన వెంట పట్టుకెళ్లారట. తన ఇద్దరు కుమారుల కోసం ఆమె వీటిని తీసుకెళ్లిందని అభిజ్ఞ వర్గాల సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం సినిమా కథనాలు పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఉమనైజర్ సందీప్ కొరియోగ్రాఫర్ డేటింగ్ భారత్ జోధ్పూర్