ప్రముఖ పాప్ గాయని, బ్రిట్నీ స్పియర్‌కు ఓ హెచ్చరిక వచ్చిందట. ఆ హెచ్చరికను జెస్సీ రణ్‌ధవా పంపిందట. ఇదేంటి భారతీయ అమ్మాయి స్పియర్స్‌ను హెచ్చరించిందా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ...? నా చెలికాడి జోలికొచ్చావంటే... టాప్ లేచిపోద్దని బ్రిట్నీ స్పియర్స్‌ను జెస్సీ హెచ్చరించిందట.
ఇటీవల విడుదలైన బ్రిట్నీ "ఉమనైజర్" ఆల్బమ్‌కు కొరియోగ్రఫీ చేసిన సందీప్‌తో బ్రిట్నీ స్పియర్స్ ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. తన చెలికాడితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ నటి, మోడల్ అయిన జెస్సీ తీవ్రంగా హెచ్చరించింది. అంతేగాదు... నాలుగున్నరేళ్ల క్రితం తనకు సందీప్‌తో డేటింగ్ అయ్యిందని, వేరేవాళ్ల బాయ్ ఫ్రెండ్‌లను సొంతం చేసుకునే నీచానికి బ్రిట్నీ స్పియర్స్ ఎందుకు పాల్పడుతుందో తనకు అర్థం కావట్లేదని జెస్సీ వాపోతోంది. మరి బ్రిట్నీ... సందీప్‌తో యధాతథంగా ప్రేమాయణం కొనసాగిస్తుందో? లేదా జెస్సీ హెచ్చరికకు అనుగుణంగా నడుచుకుంటుందో వేచి చూడాల్సిందే...!