తాను గర్భం ధరించానని వస్తోన్న వార్తలు ఏ మాత్రం నిజం కావని సూపర్ మోడల్ కేట్ మోస్ స్పష్టం చేసింది. ఇటీవల లండన్‌లోని ఐవి రెస్టారెంట్‌కు కేట్ తన స్నేహితులతో కలిసి వెళ్లగా, ఈ క్యాట్ వాక్ సుందరి ప్రెగ్నెన్సీగా ఉందని.. అందుకే చాలా నెమ్మదిగా నడక సాగించిందని డైలీ స్టార్ ప్రచురించింది.
ఈ వార్తలపై కేట్ స్పందిస్తూ.. అవన్నీ అసత్యమని మండిపడింది. ఈ వార్తలు కేవలం వదంతులేనని స్పష్టం చేసింది. ఇప్పటికే తనకు ఆరేళ్ల కుమార్తె లిలా గ్రేస్ ఉందని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. జామీ హిన్స్‌తో తన మొదటి సంతానం కోసం కేట్ ప్రయత్నిస్తోందని డైలీ స్టార్ వెల్లడించగా, మరోవైపు.. గత 2007లో పీటీ దొహెర్టీతో కేట్.. ప్రేమాయణం కొనసాగించిందని ఓ మ్యాగజైన్ తెలిపింది.