బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నందితాదాస్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన "ఫిరాఖ్" ఉత్తమచిత్రం అవార్డును సొంతం చేసుకుంది. పాకిస్తాన్‌లోని కరా చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శించబడి, ఉత్తమచిత్రంగా ఎంపికైంది. 2002 గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో, గోద్రా ఘటన తరువాత కొన్ని కుటుంబాల చుట్టూ తిరిగే.. ఈ చిత్రం, భారత్‌లో విడుదల కాకుండానే పాక్‌లో విడుదలైంది.
ఇదిలా ఉండగా.. నందితాదాస్ అనగానే ఓ సంచలనం. ఆమె తనకు నచ్చిన పనే చేస్తుందనే వార్తలు బాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. ఎలాంటి విషయమైనా ముక్కు సూటిగా చెప్పేతత్వం ఆమెదని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తాజాగా దర్శకత్వ పగ్గాలు చేపట్టి "ఫిరాఖ్" అనే చిత్రాన్ని తీశారు.
ఈ చిత్రం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా ఎంపికైంది. అంతేకాకుండా లండన్, దుబాయ్, పుసాన్‌తో పాటు అనేక చోట్ల నిర్వహించే చిత్రోత్సవాలకు కూడా ఫిరాఖ్ ఎంపిక కావడం విశేషం.
ఇదిలా ఉండగా... సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ చిత్రం "ఘటోత్కచ" కైరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైంది. మార్చి 5 నుంచి 12 వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.