2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్"కు అవార్డులు వెల్లువల్లా వస్తున్నాయి. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత "కౌన్ బనేగా కరోడ్ పతి" అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇప్పటికే.. స్లమ్‌డాగ్ చిత్రంకోసం పనిచేసిన ప్రతి కళాకారుడికి అవార్డులు కొకొల్లలుగా లభించాయి. ఇందులో భాగంగా.. స్లమ్‌డాగ్ నటుడు ఇర్ఫాన్‌కు బ్రిటీష్ పురస్కారం దక్కింది. ఇదే చిత్రానికి "బాప్టా" అవార్డులు, ఐదు గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కాయి.
అదేవిధంగా పది ఆస్కార్ నామినేషన్లు కూడా స్లమ్‌డాగ్‌కు లభించడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా.. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన సంగీత సముద్రం ఎ.ఆర్. రెహ్మాన్‌కు మాత్రమే మూడు ఆస్కార్ నామినేషన్లు లభించడం విశేషం.
తాజాగా... స్లమ్‌డాగ్ చిత్రానికి లండన్ కళాదర్శకుల సంఘం అవార్డు లభించింది. ఈ మేరకు లండన్‌లోని బెవర్లీ హిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తమ సమకాలీన చిత్రంగా కళాదర్శకుల సంఘం "స్లమ్‌డాగ్ మిలియనీర్"ని ప్రకటించింది.