అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్ పారిస్ హిల్టన్‌కు ఫిబ్రవరి 17కు 28 వసంతాలు పూర్తవుతాయి. తన పుట్టిన రోజు వేడుకలను ముందస్తుగా గత శుక్రవారం వైవిధ్యంగా జరుపుకుంది హిల్టన్. అనేక మంది ప్రముఖులు లేత ఎరుపురంగు దుస్తులను ధరించి ఈ విందుకు హాజరయ్యారట.
అంటే ఈ పార్టీలో ప్రత్యేకత ఏమిటంటే... హోటల్ సిబ్బందితో సహా పార్టీకి హాజరయ్యే అతిథులందరూ కూడా లేత ఎరుపురంగు దుస్తుల్లో రావాలన్నమాట. జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న హిల్టన్ కూడా ఇవే రంగు దుస్తులను ధరించింది. ఈ విందు కార్యక్రమంలో హిల్టన్ సోదరిణిలు నికీ హిల్టన్, ఎలిషా కథ్‌బెర్త్‌లు కూడా ఉన్నారు.
ఈ విషయాలను టార్చ్ వీక్లీ వెల్లడించింది. హిల్టన్ స్వంత నైట్‌క్లబ్ అయిన బెవెర్లీ హిల్స్‌లో ఈ విందు అత్యంత ఘనంగా సంగీత ధ్వనుల మధ్య సాగిందట.