హాలీవుడ్ ప్రముఖ నటీ జెన్నిఫర్ లవ్ హెవిట్... తన బోయ్‌ఫ్రెండ్ ఫియాన్స్ రోజ్ మెక్‌కాల్‌తో వ్యవహారం చెడిన తర్వాత కొత్తగా ఒంటరిగా తన జీవనాన్ని సాగిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) దినోత్సవాన్ని ఓ గాళ్‌ఫ్రెండ్‌తో జరుపుకుందని హాలీవుడ్ సమాచారం.
న్యూయార్క్ డైలీ న్యూస్ పత్రికతో హెవిట్ మాట్లాడుతూ, ఫియాన్స్‌ని తిరిగి కలవడమంటూ జరగదని తేల్చి చెప్పింది. ఒంటరి జీవితం ఎంతో హాయిగా ఉందని... తన గాళ్‌ఫ్రెండ్ చాలా మంచిదని వ్యాఖ్యానించింది. ఈ ఒంటరి జీవనంలో తాను ప్రస్తుతం నిజంగా ప్రేమించేది ఒక ఫ్యాషన్‌ను మాత్రమే అంటూ చెప్పింది.
అందుకే కాబోలు... ఇటీవల ఆదివారం జరిగిన నికోలస్ కే పురుషుల హాట్ హాట్ మోడల్స్ ఫోజుల ప్రదర్శనలో భాగంగా జరిగే ఫోటోల స్పాట్‌లో హెవిట్ దర్శనమిచ్చినట్లు హాలీవుడ్ వర్గాల భోగట్టా.