గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » "బ్రాడ్‌పిట్" సినిమాలో జూలియా రాబర్ట్స్..!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
హాలీవుడ్ సినీతార జూలియా రాబర్ట్స్ త్వరలో ఇండియాకు రానుందట..! ఈమె భారత్‌కు ఎందుకు వస్తుందో.? అనుకుంటున్నారు కదూ..!. తాజాగా బ్రాడ్‌పిట్ నిర్మాణ సారథ్యం వహించే కొత్త సినిమాలో జూలియా నటిస్తోందట. ఇప్పటికే ఒకసారి మన దేశానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందట. మళ్లీ "ఈట్, ప్రే, లవ్" అనే బ్రాడ్ పిట్ కొత్త చిత్రంలో నటించేందుకు అమ్మడు ఇండియాకు రానుందని తెలిసింది.

ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్‌లో జూలియా రాబర్ట్స్ ఇప్పటికే సంతకాలు చేసేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఇకపోతే.. "ప్రేమ" కోసం ఓ అమెరికన్ మహిళ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

ఇలా మలేషియా, ఇటలీ వంటి తదితర దేశాల్లో పర్యటించిన ఆ మహిళ "ప్రేమ"ను భారతదేశంలోనే కనుగొనడమే ఈ చిత్రకథాంశమని సినీ వర్గాలు వెల్లడించాయి. "ఎలిజెబత్ గిల్బర్ట్" పుస్తక ఆధారంగా తెరకెక్కనుందని హాలీవుడ్ వర్గాల సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ బ్రాడ్పిట్ సినిమా జూలియా రాబర్ట్స్ ఇండియా ప్రేమ పర్యటన మలేషియా ఇటలీ ఎలిజెబత్ గిల్బర్ట్