భారత నటి ఫ్రీడా పింటో న్యూయార్క్ వెళ్లేందుకు ప్రణాళిక చేస్తోందని బాలీవుడ్ వర్గాలు సమాచారం. న్యూయార్క్ తన స్వంత ఇళ్లులాగ కనిపించడమే కారణంగా అమె చెబుతోందిట. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చుట్టి వచ్చిన తర్వాత నుంచి తను స్వంత ఇళ్లులా భావించే న్యూయార్క్‌పై బెంగపెట్టుకున్నట్లు తెలిపింది.
బిగ్ ఆపిల్, లాస్ ఏంజెల్స్‌ల మధ్య విహారంలో కొంత సమయం తర్వాత విలేకరులతో ఆమె ముచ్చటించింది. మన్‌హాటన్ తన రెండో స్వంత ఇళ్లులా తాను భావిస్తున్నట్లు పింటో అంగీకరించింది. సంగీతం వింటూ నచ్చిన విధంగా ఉండటం వల్ల అక్కడ తన పూర్తి విశ్రాంతి పొందుతున్నానని అంటోంది.
'న్యూయార్క్‌లో ఏదో ఉంది. వివిధ రకాలుగా అది ముంబైని పోలి ఉంది. కానీ న్యూయార్క్‌లో ఉన్నంత చల్లగా ముంబైలో ఉండదని వ్యాఖ్యానించింది'.