గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » జూలియా రాబర్ట్స్ విందు జాబితాలో ఒబామా టాప్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్... తన కలల విందు ఆహ్వానితుల జాబితాలో (డిన్నర్ పార్టీ లిస్ట్) అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా మరియు ఆయన కుటుంబ సభ్యులకు అగ్ర స్థానాన్నిచ్చింది. ఈ విందు ఆహ్వానితుల జాబితాలో ఇంకా సినీ, రాజకీయ ప్రముఖులైన డియాన్ సాయర్, మైక్ నికోలస్, ఓప్రాహ్ విన్‌ఫ్రే, స్టెడ్‌మేన్ గ్రాహం, టీనా ఫే తదితరులు కూడా ఉన్నారు.

ఒకవేళ తన కల నిజమై ఈ భోజన విందు వాస్తవ రూపం దాల్చినట్లయితే... ఒబామాతోనే దీన్ని ప్రారంభిస్తామని రాబర్ట్స్ అంటోంది. అలాగే ఈ విందులో భాగంగా తనకు పుట్టిన కవలలు హజెల్ పాట్రీసియా, ఫినాయుస్ వాల్టర్‌లతో ఒబామా తనయురాళ్లైన సాషా మరియు మాలియా ఒబామాలు ఎంచక్కా ఆటలాడుకుంటారని చెబుతోంది.

ఈ కల నిజమవ్వాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది. కాగా, పిల్లల సంరక్షణ పట్ల తాను చాలా జాగ్రత్త వహిస్తానని అంగీకరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జూలియా రాబర్ట్స్ విందు జాబితా ఒబామా టాప్ ఆహ్వానితులు డ్రీమ్ కవలలు