"ఫ్రీలోడర్స్" అనే కొత్త కామెడీ చిత్రంలో... మాజీ బాండ్ భామలు జాన్ సెమోర్ మరియు డేనిస్ రిచర్డ్స్‌లు కలిసి నటించనున్నారని కాంటాక్ట్ మ్యూజిక్ పత్రిక వెల్లడించింది. రిచర్డ్ బ్రాన్సన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాండ్ గేల్స్ విలక్షణ పాత్రలు పోషిస్తున్నట్లు ఆ పత్రిక తన ప్రచురణలో తెలిపింది.
బాండ్ చిత్రంలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించిన సెమోర్, డేనిస్‌లు నటించనున్న తాజా హాస్యభరిత ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం ఈ మాజీ బాండ్ బేబీస్.. టాలెంట్ డాన్స్ షోలలో పాల్గొంటున్నారు. "ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్"లో క్రిస్మస్ జోన్స్‌గా అందరిని ఆకట్టుకున్న డేనిస్, "లైవ్ అండ్ లెట్ డై"లోనూ నటించింది.