హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 1950లలోని సంప్రదాయ దుస్తులను చూసి స్ఫూర్తి పొంది చార్లీ ఈ వ్యాపారంలోకి అడుగిడినట్లు హాలీవుడ్ సమాచారం. ఇప్పటికే ఆయన ఈ సంప్రదాయ దుస్తుల డిజైనర్లతో రంగంలోకి దిగినట్లు తెలిసింది.
ఫిబ్రవరి 18న లాస్‌వెగాస్‌లో చార్లీ తన దుస్తుల వ్యాపారాన్ని చార్లీ ప్రారంభించారు. సినీ రంగంలో విజయం సాధించిన తాను ఈ రంగంలోను చక్కటి విజయాలనే అందుకుంటానని ధీమాలో చార్లీ ఉన్నట్లు హాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. షార్ట్-స్లీవ్స్ మరియు బటన్-అప్ షర్టులపై ఆయన దృష్టి ఉందని పేర్కొన్నాయి.