ఈ మధ్య సినీతారల నగ్నఫోటోలు వెబ్‌సైట్లలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదీ హాలీవుడ్ తారల నగ్న దృశ్యాలు వెబ్‌సైట్లలో దర్శనమివ్వడం సహజమైపోయింది. తాజాగా ఆస్ట్రేలియా అందాల తార నవోమి వాట్స్ నగ్న చిత్రం వెబ్‌సైట్లలో సంచలనం రేపింది.
కాలిఫోర్నియాలోని తన ఇంటి బాల్కానీలో ఆస్ట్రేలియా నటి నవామీ వాట్స్ నగ్నంగా నిలబడి ఉన్న ఛాయాచిత్రాలు బయటకువచ్చాయి. ఇప్పటికే ఆమె కఠినమైన సిజేరియన్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఆమె నగ్న ఛాయాచిత్రాలను ప్రముఖ గాసిఫ్ వెబ్‌సైట్ పెరెజ్ హిల్టన్‌లో దర్శనమిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఈ చిత్రాల్లో ఆమె శరీరంపై సిజేరియన్ జరిగిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
వాట్స్ (40) ఎనిమిది వారాల క్రితం రెండో కుమారుడు శామ్యూల్ కైకి జన్మనిచ్చారు. తాజాగా వాట్స్ "మథర్ అండ్ చైల్డ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరీనా డెల్ రేలో జరుగుతోంది.
ఇదిలా ఉంటే... వాట్స్ కఠినమైన సిజేరియన్ పద్దతిని ఎందుకు ఎంచుకున్నారనే దానిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై వాట్స్ లేదా ఆమె భర్త లీవ్ స్క్రైబెర్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.